A massive 404-carat diamond has been unearthed in Angola by an Australian mining company. This three-inch gem, one of the largest ever found in the world, is worth £10 million, as per the company's chief.
404 క్యారెట్లు..అతిపెద్ద వజ్రం
అంగోలా: పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన లుకాపా మైనింగ్ కంపెనీ అంగోలాలో భారీ వజ్రాన్ని కనుగొన్నది. 404 క్యారెట్ల ఈ వజ్రం విలువ సుమారు రూ.95 కోట్లు ఉంటుందని అంచనా. సంస్థ ఛీప్ ఎగ్జిక్యూటివ్ వెతరల్ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది అంగోలా దేశంలో అతిపెద్ద వజ్రమంటూ సంతోషం వ్యక్తం చేశారు. లుకాపా సంస్థ విడుదల చేసిన ఛాయాచిత్రంలో ఈ వజ్రం పొడవు సుమారుగా ఏడు సెంటీమీటర్లుందని తెలిపారు. తమ అన్వేషణలో బయటపడిన ఈ డైమండ్ ప్రపంచంలో 28వ పెద్ద వజ్రమని ఆయన పేర్కొన్నారు. చాలా మారుమూల ప్రాంతంలోని ఏడువందల కిలోమీటర్ల లోతట్టు తీరం నుంచి దీన్ని వెలికితీశామని వెతరల్ చెప్పారు. ఈ ప్రకటన వెలువడగానే మార్కెట్‌లో లుకాపా కంపెనీ షేర్లు 29 శాతం లాభాలను నమోదు చేశాయన్నారు. కాగా 1893లో బ్రెజిల్‌లో కనుగొన్న 3,167 క్యారెట్ల వజ్రం ''సెర్గియో'' ప్రపంచంలో అతిపెద్దది.
Post a Comment